**సామాజిక చైతన్యం కోసం కృషి చేస్తున్న నర్రి స్వామి అభినందనీయులు… హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ**
హైదరాబాదులో హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ నీ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది, మునుగోడు నియోజకవర్గం కంటెస్టెండ్ ఎమ్మెల్యే అభ్యర్థి నర్రి స్వామి కురుమ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి లాయర్స్ ఫోరమ్ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ క్యాలెండర్ ని ఆవిష్కరించిన అనంతరం హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నర్రి స్వామి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయుచునే సామాజిక న్యాయం కోసం పోరాటం చేయడం అభినందనీయం అన్నారు విద్యావంతులైన యువకులు సామాజిక చైతన్యం కోసం కృషి చేయడం సమాజానికి శ్రేయస్కరం అన్నారు నర్రి స్వామి మాట్లాడుతూ హర్యానా గవర్నర్ దత్తాత్రేయ లాయర్స్ పోరం క్యాలెండర్ ని ఆవిష్కరించి కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి న్యాయవాద సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేయడం చాలా సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, బార్క రాకేష్ సిటీ సివిల్ కోర్టు జాయింట్ సెక్రెటరీ, దయ్యాల మాణిక్ , దయ్యాల రాకేష్ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు శ్రీరామ్ , నక్కరాజు తదితరులు పాల్గొన్నారు