సేవా రత్న జాతీయ అవార్డు అందుకున్న నాసర్ పాషా

జాతీయ
Headlines in Telugu:
  • సేవా రత్న జాతీయ అవార్డు అందుకున్న నాసర్ పాషా
  • నాసర్ పాషా సేవలను ప్రశంసించిన నల్లా రాధాకృష్ణ
  • విద్యార్థులకు యూనిఫామ్ అందించిన కార్యక్రమం

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

శ్రీవిద్యాభ్యాస పాఠశాల ఆధ్వర్యంలో
ముఖ్య అతిథిగా పాల్గొన్న బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ
యాదగిరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ అందజేశారు.
బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక సేవారత్న జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా కి ఆదివారం నాడు సంతోష్ నగర్ లోని శ్రీ విద్యాభ్యాస పూర్వ బాలగలుగు పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. పాఠశాల నిర్వాహకులు బి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అభినందన సభలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పురస్కారం వ్యక్తి బాధ్యతలను మరింత పెంచుతుందని అన్నారు. మణుగూరు ప్రాంతంలో అనేకమంది సామాజిక కార్యకర్తలుగా సేవకులుగా స్వచ్ఛంద సంస్థలను నడిపిస్తూ నిర్వహిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని మణుగూరు ప్రత్యేకతను ఆయన కొనియాడారు. సమీప గ్రామాల ఆదివాసి గిరిజన నిరుపేద అనాధలను అన్నార్తులను చేరదీసి వారి విద్యాభ్యాసానికి ఎంతగానో పాటుపడుతున్న శ్రీ విద్యాభ్యాస పాఠశాల (బాల వెలుగు)నిర్వాహకుల సామాజిక స్ఫూర్తి ప్రశంసనీయమని అభినందించారు. విద్యార్థులు ఉన్న చదువులు చదివి వృధ్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. సింగరేణి కార్మికునిగా కార్మిక సమస్యలతో పాటు కాంటాక్ట్ వర్కల ప్రధాన సమస్యలను పరిష్కరిస్తూ నిర్వాసితులకు అండగా ఉంటూ యువతకు ఉపాధి కల్పిస్తూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు చురుకైన పాత్రను పోషిస్తూ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సింగరేణి సేవా సమితి సభ్యులు సామాజిక సేవా కార్యకర్తగా నా సర్ పాషా మరియు వారి సతీమణి జమీలా బేగం సేవలు అభినందనీయమని ఆయన ప్రశంసించారు. అనంతరం దంపతులు ఇరువురికి పాఠశాల నిర్వహకులు, విద్యార్థులు, కాంటాక్ట్ కార్మికులు, సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉద్యోగులు. కార్మిక సంఘాల స్వచ్ఛంద సంస్థల సభ్యులు, బంధుమిత్రుల ఆధ్వర్యంలో శాలువా పుష్పగుచ్చం జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.బాల వెలుగు పాఠశాల భవన యజమాని అయితం రాజు యాదగిరి, లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సుమారు 72 జతల స్కూల్ యూనిఫామ్ ముఖ్యఅతిథి చేతులు మీదుగా విద్యార్థులకు అందజేశారు. యాదగిరి సేవలను ఈ సందర్భంగా పలువు అభినందించారు. అనంతరం విద్యార్థులకు ఆహ్వానితులకు సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జిల్లా అధ్యక్షులు నల్లా జ్యోతి,పాఠశాల నిర్వహకులు బి జగన్మోహన్ రెడ్డి మణుగూరు ఏరియా ఐ ఎన్ టి యు సి బ్రాంచి నాయకులు ఎండి షాబుద్దీన్, సిఐటియు నాయకులు వి వెంకటరత్నం, టీవీవీ ప్రసాద్, హెచ్ ఎం ఎస్ నాయకురాలు కొడిపల్లి శ్రీలత, బి ఎం ఎస్ నాయకులు భూక్య కిషన్, ఐ ఎఫ్ టి యు నాయకులు అంగోత్ మంగీలాల్, ఉప్పల శివ రామకృష్ణ, సేవా కార్యదర్శి, షేక్ షాకీరా రవూఫ్,విద్యా జ్యోతి చైర్మన్ చంద్రమోహన్, అశ్వాపురం ఆరిఫా అండ్ రోషిని వృద్ధాశ్రమం నిర్వాహకులు షేక్ షహనాజ్ , మెహరాజ్ దంపతులు హుమాయూన్, లాహ్యా ,యాదగిరి, లక్ష్మి పెండ్యాల లక్ష్మయ్య, మంగ, మేకల కేశవ స్వామి, సేవా సభ్యులు సంధ్య, మాధవి, సామాజిక కార్యకర్త కర్నె బాబురావు,నాగుల జ్యోతి, సోలార్ సెక్యూరిటీ సిబ్బంది చల్ల కాంతారావు, శ్రీకాంత్,విశ్వాస్ సెక్యూరిటీ ఫోర్స్ సభ్యులు రామ్ అవతార్, సుధాకర్, రబ్బాని, రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ వీర్రాజు, గురుమూర్తి, రామకృష్ణ, సాంబ, పాఠశాల సిబ్బంది సుహాసిని దేవి, స్వాతి, కావేరి, సుజాత
తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now