బోధన్ రూరల్లో ‘నషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ కార్యక్రమం
బోధన్ రూరల్, నవంబర్ 18 (ప్రశ్న ఆయుధం)
‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా బోధన్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలూరా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో అవగాహనా సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, కల్లు మరియు మత్తు పానీయాల వినియోగాన్ని నిరోధించేందుకు విద్యార్థులు మరియు గ్రామస్థులకు మాస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ సిఐ, ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల ముప్పు నుంచి యువతను రక్షించడమే లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.