శాలువాతో ఘనంగా సత్కరించిన
ఎమ్మెల్యే పాయం
మరెన్నో అవార్డులు సాధించాలని ఎమ్మెల్యే పాయం ఆకాంక్ష
బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సామాజిక విభాగంలో ప్రతిష్టాత్మక సేవారత్న జాతీయ అవార్డుకు ఎంపికైన మణుగూరు కు చెందిన సామాజిక కార్యకర్త సింగరేణి కార్మిక నాయకులు ఎస్ డి నా సర్ పాషా ను మంగళవారం సాయంత్రం ప్రజా భవన్ లో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు శాలువాతో ఆత్మీయంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మణుగూరు ప్రాంతంలో సింగరేణి ఉద్యోగులకు మరియు అనాధలు వృద్ధులకు గొత్తి కోయల గ్రామాల, నిర్వాసిత ప్రజల ఉపాధికి గ్రామాల అభివృద్ధికి ఎంతగానో శ్రమిస్తూ సామాజిక సేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నాసర్ పాషా నీ ప్రతిష్టాత్మక సేవా రత్న జాతీయ అవార్డు ప్రకటించడం పట్ల హైదరాబాద్ కు చెందిన బహుజన సాహిత్య అకాడమీ నిర్వాహకులను ఆయన అభినందించారు మరెన్నో చక్కటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని పాషా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.