పెద్ద కొడప్గల్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం 

పెద్ద కొడప్గల్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం

 

కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్,జుక్కల్ ఆర్సీ(ప్రశ్నఆయుధం)జూలై 01

 

కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా డాక్టర్ ఉమాకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఆసుపత్రి ముందు మొక్కలు నాటారు.తరువాత డాక్టర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఉమాకాంత్ మాట్లాడుతూ ప్రతీ ప్రాణం వెనుక ఓ వైద్యుని సేవ ఉంటుంది. వారి నిస్వార్థ కృషికి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. సామాజిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సేవలందిస్తున్న వైద్యుల కృషి అసామాన్యం.వారి సహానుభూతితో కూడిన నిబద్ధత వల్లే ఆరోగ్య రంగం ప్రజలకు మరింత దగ్గరైంది” అని అన్నారు.

కోవిడ్ వంటి విపత్కర కాలంలో వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.అలాంటి సమయంలో వారు చేసిన సేవలు ప్రతి ఒక్కరికీ ప్రేరణ. డా. బీసీ రాయ్ చూపిన సేవా మార్గం వైద్యులకి ఆదర్శం. అటువంటి ఆచార్యుల వారసులుగా ప్రతి వైద్యుడు సేవలందించడం గర్వకారణం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్మసిస్ట్ అనిత, హెల్త్ సూపర్వైజర్ అన్నయ్య,స్టాఫ్ నర్స్ లు శ్రీదేవి,రజిత,జ్ఞానేశ్వర్ ల్యాబ్ టెక్నీషియన్ పోచయ్య, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment