జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమం.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 01
జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని అఖిల ఆసుపత్రిలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పుట్ట మల్లికార్జున్, డాక్టర్ పుట్ట భవాని లను సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం, సభ్యులు వైద్యులను శాలువాతో సత్కరించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జోనల్ అధ్యక్షులు పల్లి ప్రదీప్ కుమార్, లీగల్ సెల్ అధ్యక్షురాలు న్యాయవాది షబానా బేగం, మహిళా అధ్యక్షురాలు సట్ల జమున, కామారెడ్డి జిల్లా ప్రతినిధులు కట్లకుంట రామచందర్, అన్వర్ గౌరీ,, శ్రీకాంత్ (అభి ), శ్రీనివాసరావు,, ఎం.వి భాస్కర్, శ్రీనివాస్,రాజు, న్యాయవాది నరసింహ చారి,మొహమ్మద్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.