“ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి” – నీలం చిన్న రాజులు

జాతీయతా జెండాతో బీజేపీ బాట..

హర్ ఘర్ తిరంగా… విభజన గాయాల స్మృతిదినం – జిల్లా కార్యశాల

“ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి” – నీలం చిన్న రాజులు

13,14 తేదీల్లో మండల, గ్రామ స్థాయిలో తిరంగా యాత్రలు

ఆగస్ట్ 14న భారత్–పాక్ విభజన గాథ ప్రజలకు వివరించాలి

స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాల శుభ్రపరిచే మహిళా మోర్చా పిలుపు

యువతలో జాతీయతా స్పూర్తి నింపాలని నేతల పిలుపు

ప్రశ్న ఆయుధం ఆగష్టు 8

కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు ముందుగా విభజన గాయాల స్మృతిదినం, హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్ర అంశాలపై జిల్లా స్థాయి కార్యశాల నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ – “స్వాతంత్ర్య ఉద్యమం అనేక త్యాగాల ఫలితం. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి. ప్రజల్లో జాతీయతా భావం బలపడేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలి” అన్నారు.

ఆగస్ట్ 13,14 తేదీల్లో మండల, గ్రామ స్థాయిలో తిరంగా యాత్రలు నిర్వహించాలని, ఆగస్ట్ 14న భారత్–పాకిస్థాన్ విభజన చరిత్ర, దాని గాయాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు, ప్రాంగణాలను శుభ్రపరచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరుణా తార, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, కార్యక్రమ కన్వీనర్ వెంకటేష్, నాయకులు కిషన్ రావు, మోటూరి శ్రీకాంత్, వేణు, నరేందర్, శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, రవీందర్, రాజగోపాల్, లింగారావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment