జులై లో జాతీయ వాద జర్నలిస్ట్ శక్తి ప్రదర్శన: కప్పర ప్రసాద రావు

జులై లో జాతీయ వాద జర్నలిస్ట్ శక్తి ప్రదర్శన: కప్పర ప్రసాద రావు

జూలైలో జాతీయ వాద జర్నలిస్టుల బలమేందో హైదరాబాదులో చూపిస్తాం

కేంద్ర మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తాం

మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం

జాతీయ వాద జర్నలిస్టు శక్తి ప్రదర్శన హైదరాబాదులో చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల కోసం కేవలం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మాత్రమే పోరాటం చేస్తుందని మిగతా యూనియన్లు వారి సొంత ప్రయోజనాల కోసం ప్రకులాడుతారన్నారు.
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మేడ్చల్ మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతనంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా రామకృష్ణ కార్యదర్శిగా వేణుగోపాల్ రెడ్డి అక్రిడేషన్ సమన్వయ కమిటీ కన్వీనర్ గా వక్కల వెంకటేష్ సలహాదారునిగా సత్యం వీరమల్లు రాష్ట్ర మహిళా కన్వీనర్ గా దేవరకొండ లావణ్య కో కన్వీనర్ గా పి సునీత సావనీర్ కమిటీ కన్వీనర్ గా కపిలవాయి రవీందర్ కో కన్వీనర్ గా అశోక్ ఎన్నుకోబడ్డారు . సభ్యులుగా కాట్యాడ బాపురావు ఎన్నుకోబడ్డారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ
తెలంగాణ కోసం కొట్లాడిన జర్నలిస్టులకు కేసిఆర్ నట్టేట ముంచితే రేవంత్ రెడ్డి అదే బాటలో ప్రయాణిస్తున్నారనేది మంచి పద్ధతి కాదన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ జర్నలిస్టులు గా ఎవరిని గుర్తించాలని అనడం హాస్యాస్పదంగా ఉందని ఇన్ని రోజులు కలిసి పనిచేసిన వారందరూ జర్నలిస్టులు లాగా కనిపిస్తలేరని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వానికి జోకేటోలకే పదవులు వచ్చాయని రేవంత్ రెడ్డి వారిని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని కెసిఆర్ పై పోరాటం చేసిన ఏ ఒక్క జర్నలిస్టుకు రేవంత్ రెడ్డి న్యాయం చేయలేదన్నారు. తెలంగాణ వచ్చిన నాటినుండి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అని ఉరిస్తూనే ఉన్నారని అవి నేటికీ అందని ద్రాక్ష లాగే మారాయి అన్నారు. బిపిఎల్ కింద ఇచ్చే ప్లాట్లకు అక్రిడేషన్ తో సంబంధం ఏమని అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్టుగా గుర్తిస్తాం అనడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం పత్రికలకు చేసిన ABCD కేటాయింపే వారికి ఇష్టం వచ్చినట్టు చేశారు అన్నారు. జూలైలో జర్నలిస్టుల బలం ఏందో హైదరాబాద్ వేదికగా చూపిస్తామని దానికి కేంద్ర మంత్రి అమితాషా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు జరిగిన అన్యాయాలను కేంద్రం రాష్ట్రం దృష్టికి తీసుకువచ్చి జర్నలిస్టులకు న్యాయం చేసేందుకు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ముందువరుసలో ఉండి పోరాటం చేస్తుందన్నారు .దీనికి అన్ని జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించాలని జర్నలిస్టుల సమస్యలను జర్నలిస్టుల పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పెన్షన్లు ఇండ్ల స్థలాలు వారి పిల్లలకు ఉచిత విద్య రైల్వే పాసులు టోల్ గేట్ ఫీజు లాంటి సమస్యలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరించేలాగా ఈ సభ ఉండ బోతుందన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ కార్యదర్శి భరత్ కుమార్ శర్మ ఐఎఫ్డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ మెంబర్ కపిలవాయి రవీందర్ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి ఉపాధ్యక్షులు రాజమౌళి గౌడ్ కార్యదర్శులు బాపు రావు ,దశరథ్ మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షులు వల్లపు శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్ మెదక్ జిల్లా అధ్యక్షులు రామయ్య యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సాయి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి ఈసీ మెంబర్ పశుపతి సాగర్ శీను గుడాల శేఖర్ బాలచంద్రం వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment