*జాతీయ కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన కావ్యకు సన్మానించిన అంబాల ప్రభాకర్ (ప్రభు)*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 6*
గ్లోబల్ చోటా కాన్ కరాటే డూ ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీలలో జమ్మికుంట మారుతి నగర్ కు చెందిన జన్ను రమేష్ కుమార్తె జన్ను కావ్య జమ్మికుంటలోని సెయింట్ జోసెఫ్స్ స్కూల్ లో 9 వ తరగతి చదువుకుంటూ గత 6 నెలలుగా కరాటే మాస్టర్ జాలీల్ వద్ద ప్రత్యేక శిక్షణ పొంది కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన నారాయణ రెడ్డి మోమోరియల్ మొదటి జాతీయ స్థాయి కరాటే చాంపియన్ ఈ నెల 4 న జరుగగా పోటీలలో 15 సం. విభాగంలో కటాస్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరచి బంగారు పతకం సాధించగా మంగళ వారం జమ్మికుంట కు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులు అంబాల ప్రభాకర్ (ప్రభు) బంగారు పతకం కావ్య మేడలో వేసి శాలువతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు ప్రభు మాట్లాడుతూ జన్ను కావ్య కరాటే పోటీలలో బంగారం పతకం సాధించడం ఈ ప్రాంతానికే కాకుండా కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని అభివర్ణించారు ప్రత్యేక శిక్షణ అందిస్తూ వందలాది మంది విద్యార్ధిని విద్యార్థులను జాతీయ అంతర్జతీయ పోటీలలో ప్రతిభ కనబరిచే విధంగా తయారు చేస్తున్న హుజురాబాద్ కరాటే మాస్టర్ జలీల్ ను ప్రత్యేకంగా శాలువతో సత్కరించి అభినందించారు భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ పోటీలలో బంగారు పతకాలు సాధించాలని కోరారు యువతి యువకులు చెడు వ్యసనాలకు దూరం ఉంటూ కరాటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లలో దృష్టి సాధిస్తూ మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహద పడతాయని చదువుతోపాటు కరాటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లలో పాల్గొని తమ ప్రాంతానికి గొప్ప పేరు తీసుక రావడమే కాకుండా తమ తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాలని కోరారు.