రాణే పరిశ్రమలో జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు
బి.ఎం.ఎస్ యూనియన్ కార్యనిర్వాక అధ్యక్షులు సల్ల శ్రీనివాస్
గజ్వేల్ సెప్టెంబర్ 17 ప్రశ్న ఆయుధం :
17 సెప్టెంబర్ రోజున జాతీయ కార్మిక దినోత్సవం మరియు విశ్వకర్మ జయంతి సందర్భంగా మన రాణే పరిశ్రమలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలవేసి జెండా ఆవిష్కరణ చేసిన స్వీట్లు పంచిపెట్టిన బి.ఎం.ఎస్ యూనియన్ నాయకులు ఎ.నాగభూషణం జెండా ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న రాణే పరిశ్రమ బిఎంఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.శ్రీశైలం , కార్యనిర్వాహక అధ్యక్షులు సల్ల శ్రీనివాస్ లు మాట్లాడుతూ ఆది కార్మికుడు విశ్వకర్మ , పంచకర్మల సృష్టికర్త విశ్వకర్మ , పనిముట్లు సృష్టించిన మహనీయుడు విశ్వకర్మ , విష్ణు చక్రం హనుమంతుని గద, కత్తి,సుత్తి, కొడవలి ఇలా అన్ని కుటీర పరిశ్రమలకు అవసరమయ్యే సాధనాలు కనిపెట్టింది విశ్వకర్మ, ఇంద్రభవనం నిర్మించిన ఇంజనీర్ వాస్తు శిల్పి కార్మిక వ్యవస్థకు పురుడు పోసింది విశ్వకర్మ మానవ మనుగడకు మార్గదర్శకుడు విశ్వకర్మ సకల చరాచర సృష్టికి సమస్త వృత్తులకు మూలకారకుడైన విశ్వకర్మ జయంతిని 17 సెప్టెంబర్ రోజున జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అంతేకాకుండా కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు నిరంతరంగా పోరాటం చేస్తూ కార్మికుల హక్కులను కాపాడుతున్న యూనియన్ బిఎంఎస్ ఒకటే అని కొనియాడారు. కానీ రాణే పరిశ్రమలో అధికార సీఐటీయూ యూనియన్ యాజమాన్యంతో కుమ్మక్కై డస్ట్ సెక్షన్లు సరిగా పనిచేయకున్న కార్మికుల చేత పనిచేపిస్తూ శ్రమ దోపిడికి గురి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా టెంపరరీ ఆపరేటర్స్ (టిఓటిస్) పేరుతో మూడు సంవత్సరాలకు పరిశ్రమలో పనిచేయాలని ఒప్పందం చేసుకొని వారానికి నాలుగు రోజులు పని కల్పిస్తూ మిగతా రోజులు పనిలేదని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వేతనాలలో కోతలు పెట్టే విధంగా వాళ్ల నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం వారు ఇప్పటికైనా ఈపద్ధతిని మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ యూనియన్ నాయకులు పులుగం శ్రీనివాస్, బి.శ్రీనివాస్ , కె.కనకయ్య , ఎస్ కె.నజీర్ , కె.దేవేందర్ , బి.శివకుమార్ , యం.దేవయ్య , వి.యాదగిరి , డి.కిష్టయ్య , పి.బాల్ రెడ్డి , కె.విజయ్ కుమార్ , జి.రంగయ్య , కదుల్ల విజయ్ కుమార్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.