వర్గీకరణకు మద్దతు పల్కిన జాతీయ నేత యోగేంద్ర యాదవ్

IMG 20240810 WA0070

ఎస్సీ ఎస్టీల ఉపకులల వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గొప్ప రాజకీయ విశ్లేషకుడు, జాతీయ రైతు నేత యోగేంద్ర యాదవ్ స్వాగతించారు. ఐతే అందులో కొన్ని లొసగులు ఉన్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిగమించాల్సిన అవసరముందన్నారు. ఐతే “బీసీల వలే” ఎస్సీ ఎస్టీలలో వర్గీకరణ ఉండడం సబబే. ప్రతి ఫలం ప్రతి ఒక్కరికీ దక్కలన్నదే సామాజిక న్యాయం. ఎస్సీ ఎస్టీలలో ఎవరైతే ఫలితం పొందారో, ఐతే పొందని వారికి తగు ప్రాతినిధితత్వం కోసం అగ్రకుల ప్రభుత్వాలు కృషి చేయలేదని ఆరోపించారు. రిజర్వేషన్ల తలుపులు ఓపెన్ ఐన సందర్భంలో ముందు వరసలో ఉన్న కులాలు ఫలం పొందారు. అది స్వాభావికమే. ఐతే వారి తప్పు అసల్కే కాదు. ఈ మధ్య ఎస్సీ ఎస్టీలలో వెనుకబడిన కులాలు విద్యాపరంగా ఎదిగినట్లు యూనివర్సిటీల దాఖలాలు ఉన్నాయి. వారికి తగు అవకాశం ఇవ్వడమే వర్గీకరణ ప్రాధాన్యత సంతరించు కుందన్నారు. ఐతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటాంటే కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలలో ఉన్న కులాలు మరో రాష్ట్రాల్లో బీసీ వర్గంలో ఉన్నాయి. అందుకే ఆయా రాష్ట్రాలు సామాజిక (అంటరానితనం) ప్రాతిపదికన “సమగ్రమైన డేటా” సేకరించాల్సి తక్షణ అవసరముందన్నారు. మాజీ దళిత్ ఫాంథర్ సాహిత్యవేత్త, ఇండియన్స్ సోషల్ మూవ్మెంట్ (ఐఎస్ఎం) జాతీయ అధ్యక్షులు ఆనందా ఓవాల్ మాట్లాడుతూ 1932లో పూణే ఒప్పందంతో తొలిసారిగా ఎస్సిలకు రిజర్వేషన్లు ప్రారంభమైనాయి. 1942లో ఎస్సీలకు 8% కేటాయించబడింది. 1950లో ఉమ్మడి ఎస్సీ ఎస్టీలకు 15% అమలోకి వచ్చిందన్న చరిత్రను వివరించారు. ఐతే బాబాసాహెబ్ అంబేడ్కర్ 1955లో చెప్పిన “ఎస్సీలలో రిజర్వేషన్ల ద్వారా లాభం పొందిన వారు, సమర్థవంతంగా ఎదిగిన అనంతరం వారు తమ నైతిక భాధ్యతతో వేరే వారికి ఈ అవకాశం ఇవ్వాలని” ఆనాడే సూచించారని ఈ సందర్భంగా ఉదహరించారు. వర్గీకరణకు ఓవాల్ మద్దతు పల్కారు. మహారాష్ట్ర భారత్ జోడో అభియాన్ (బిజెఎ) చే శనివారం ముంబైలో “సామాజిక న్యాయ సంభాషణ” కార్యక్రమం జరిగింది. డిల్లీ నుంచి బిజెఎ జాతీయ కోఆర్డినేటర్ యోగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఇందులో ఐఎస్ఎం జాతీయ ఉపాధ్యక్షులు మూల్ నివాసి మాలజీ పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now