ఉప్పల్‌లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

ఉప్పల్‌లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

మేడ్చల్ జిల్లా ఉప్పల్ ప్రశ్న ఆయుధం ఆగస్టు 11

ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు బండారి లక్ష్మా రెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ సి. ఉమా గౌరితో కలిసి జెడ్‌పీహెచ్‌ఎస్ ఉప్పల్‌లో పిల్లలకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ, 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో నులిపురుగుల నిర్మూలన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

డాక్టర్ సి. ఉమా గౌరి మాట్లాడుతూ, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల పిల్లలలో నులిపురుగులు వస్తాయని చెప్పారు. ఈ సమస్య నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలని సూచించారు. అనంతరం వారు విద్యార్థులకు మాత్రలను అందించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ సత్యవతి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కౌశిక్, పీహెచ్‌సీ ఉప్పల్ వైద్యాధికారి డాక్టర్ శౌశీల్య, ఇతర వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, పోలీసులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now