Headlines in Telugu
-
జాతీయ లోక్ అదాలత్ కోసం కల్వకుర్తి లో సన్నాహక సమావేశం
-
జ్యోత్స్న గుంటి జడ్జి న్యాయవాదులు, బ్యాంకు అధికారులతో లోక్ అదాలత్ పై చర్చ
-
పెండింగ్ కేసుల పరిష్కారం కోసం బార్ అసోసియేషన్ సన్నాహక సమావేశం
-
జాతీయ లోక్ అదాలత్ యొక్క విజయాన్ని నిర్ధారించేందుకు అన్ని వర్గాల సహకారం కోరిన జ్యోత్స్న గుంటి
-
బ్యాంకు, పోలీస్, ఫారెస్ట్ అధికారులతో లోక్ అదాలత్ ఏర్పాటుకు సిద్ధమవుతున్న కల్వకుర్తి
జూనియర్ సివిల్ కోర్టు జడ్జి
జ్యోత్స్న.
ఈనెల 24న రెండవ శనివారం నిర్వహించే లోక అదాలత్ గురించి గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన బార్ అసోసియేషన్ ప్రాసిక్యూషన్ పోలీస్ అధికారులతో బ్యాంక్ అధికారులతో జూనియర్ సివిల్ జడ్జి గుంటి జోష్ణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇట్టి సదస్సుకు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, కార్యదర్శి యన్. నిరంజన్, ఎ.పి.పి. శిరీష, లోక్ అదాలత్ సభ్యులు ఆర్. కురుమూర్తి, న్యాయవాదులు పి. బాల స్వామి, పి. నాగరాజు, పి. రాజు, మల్లయ్య, స్థానిక సీఐ కే మహేష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, కొల్లాపూర్, కొడేర్ ఎస్సై లు పి. హృషికేశ్, గోకారి, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ హనుమంతు నాయక్, పెంట్లవెల్లి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, ఎస్బిఐ బ్యాంకు మేనేజర్ డి. మేఘ శ్యామ్, జీ. విశ్వనాథ్, లోక్ అదాలత్ సిబ్బంది హరికృష్ణ , పోలీసు కానిస్టేబుల్స్ రాములు, రాముడు, సత్యనారాయణ, రాజశేఖర్ హాజరయ్యారు. న్యాయమూర్తి జ్యోత్స్న గుంటి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసుల పరిష్కారానికి అందరూ సహకరించి, లోక్ అదాలత్ ను దిగ్విజయం చేయాలని కోరారు.అలాగే బ్యాంకులలో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని బ్యాంకు అధికారులను కోరారు.