జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవ సమావేశము*  

*జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవ సమావేశము*

 

*జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం*

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 6.

 

కామారెడ్డి జిల్లాలో , అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవ సమావేశము ను జిల్లా అధికారులతో నిర్వహించడం జరిగింది. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవo 2025 సంవత్సరంకుగాను ఈ నెల ఆగస్టు 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఇట్టి జాతీయ నులిపురుగుల దినోత్సవం నాడు అనగా ఆగస్టు 11వ తేదీన కామారెడ్డి జిల్లాలోని 1 నుంచి 19 సంవత్సరాలు గల పిల్లలు అందరూ ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలని మరియు వారి తల్లిదండ్రులు 1 నుంచి 19 సంవత్సరాలు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించేలా చర్యలు తీసుకోవాలని, నులిపురుగుల వల్ల వచ్చే వ్యాధుల పట్ల ప్రజలలో అవగాహన పెంచాలని ఇట్టి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధికారులకు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment