Site icon PRASHNA AYUDHAM

జాతీయ ఓబీసీ మహాసభ గోడ ప్రతుల ఆవిష్కరణ

Screenshot 2025 07 21 18 24 13 881 edit com.android.chrome

జాతీయ ఓబీసీ మహాసభ గోడప్రతుల ఆవిష్కరణ

 బీసీ సంక్షేమ,విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు, నీల నాగరాజు .

కామారెడ్డి జిల్లా ఇంఛార్జి(ప్రశ్న ఆయుధం)జులై 21

కామారెడ్డి జిల్లా కేంద్ర లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో గోడ ప్రతుల ఆవిష్కరించారు. అనంతరం జిల్లా బీసీ సంక్షేమ సంఘం, విద్యార్థి సంఘం అధ్యక్షులు సాప శివ రాములు, నాగరాజు లు మాట్లాడుతూ వచ్చే నెల ఆగస్ట్ 7 న గోవా రాష్ట్రంలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జాతీయ ఓబీసీ మహా సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో మొదటిసారి మండల కమీషన్ సిఫార్సులు అయినా ఓబీసీలకు ఉద్యోగ రంగంలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ సింగ్ ప్రకటించిన ఆగస్ట్ 7 రోజున ప్రతీ సంవత్సరం దేశంలోని అన్ని బీసీ ఉద్యమ శక్తులను కలుపుకొని జాతీయ ఓబీసీ మహా సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.10 వ సారి జరిగే ఈ జాతీయ ఓబీసీ మహాసభకు దేశంలోని 29 రాష్ట్రాల నుండి పది వేల మంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ సభకు దేశంలోని అఖిల పక్ష రాజకీయ పార్టీల నేతలను, ఓబీసీ జాతీయ నాయకులకు ఆహ్వానం అందినట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు గోవా రాష్ట్రంలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ మహాసభకు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో జాతీయ స్థాయిలో ఓ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల డిమాండ్ల పై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివ రాములు నేత, మరికంటి భూమన్న జిల్లా అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు మారోజు మోహనా చారి, నాగోజి నారాయణరావు, హాజీ అబ్దుల్ అజీజ్, మడిపెద్ది వెంకటి, కుంభాల లక్ష్మణ్ యాదవ్, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి,ఎస్ దయాకర్, విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి,అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, కామారెడ్డి టౌన్ అధ్యక్షులు జుర్రీ గల నరసయ్య, ఎల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version