*జాతీయ రోడ్డు భద్రత అవగాహనా ప్రోగ్రామ్*
*పిట్లం జాతీయ రహదారి శివాజీ చౌక్ వద్ద వాహనదారులకు రోడ్డు భద్రతాపై అవగాహనా ప్రోగ్రామ్ నిర్వహించిన అధికారులు*
ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ నియోజక ప్రతినిధి
జనవరి-09
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని జాతీయ రహదారి శివాజీ చౌక్ వద్ద మండల పోలీస్ సిబ్బంది మరియు నేషన్ హైవే సిబ్బంది తో కలిసి 36 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాహనందారులకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించ వలసిన అంశాల గురించి పలు సూచనలు తెలియజేశారు. అలాగే కరపత్రాలను సైతం వాహనాధరులకు అందజేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో మండల పోలీస్ సిబ్బంది,జాతీయ రహదారుల సిబ్బంది వాహనాధరులు తదితరులు పాల్గొన్నారు..