జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు విజయవంతం చేయాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు యువత, విద్యార్థులు, ప్రజల్లో విస్తృత అవగాహన అవసరం
: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 20
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రోడ్డు భద్రతను మెరుగుపరచేందుకు శాఖల మధ్య సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జనవరిలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ర్యాలీలు, వాక్ థాన్‌లు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.