ఢిల్లీ పబ్లిక్ సెకండరీ స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవం

IMG 20250301 210904
సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి శివారులోని “ఢిల్లీ పబ్లిక్ సెకండరీ స్కూల్” లో జాతీయ సైన్స్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సైన్స్ పై విభిన్నమైన సైన్స్ మోడల్స్ ను రూపొందించారు. పలు రకాల విభిన్న అంశాలను ఆధారంగా చేసుకుని మోడల్స్ రూపొందించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ, “ఈ తరహా ప్రయోగాలు, ఆవిష్కరణలు భవిష్యత్తులో యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు మార్గదర్శనం చేస్తాయని అన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించి, వారి ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సైన్స్ క్విజ్, ప్రదర్శనలు, ప్రాతినిధ్య స్పీచులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. సైన్స్ మరియు టెక్నాలజీ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కీలకం అనే సందేశంతో ముగిసిన ఈ వేడుక అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ వేడుకలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now