రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన ఫర్ చిల్డ్రన్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఎమ్మెల్యే జారె

రాష్ట్రీయ
Headlines:
“EMLJ జారె: రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన ఫర్ చిల్డ్రన్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి”

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి నవంబర్ 2

అన్నపురెడ్డిపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఈనెల 18 ,19 20 వ తారీకులలో నిర్వహించబోయే సైన్స్ ఫెయిర్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అశ్వారావుపేట ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక,పర్యావరణ, ఆరోగ్యం పట్ల ఆసక్తి అభిరుచి కలిగించటానికి ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైన్స్ యాక్టివిటీకి సంబంధించిన కార్యక్రమాలు నవంబర్ లేదా డిసెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని.ఈ కార్యక్రమాన్ని రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన ఫర్ చిల్డ్రన్స్ ఆర్ బి వి పి పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహించటం జరుగుతుందని.అటువంటి మంచి కార్యక్రమం అశ్వారావుపేట నియోజకవర్గం
అన్నపురెడ్డిపల్లి మండలంలో నిర్వహించటం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా రెండు వేల మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొంటున్నారని. వారందరికీ ప్రత్యేక వసతులు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రతి విద్యార్థికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూస్తామని విద్యారంగాన్ని మరింత అభివృద్ధి పరచటానికి నియోజకవర్గ ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.అలాగే మండలంలో ఉన్న అన్ని శాఖల అధికారులు కూడా మండల అభివృద్ధి కోసం చక్కటి సహకారం అందిస్తున్నారని అధికారులను అభినందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం విజయవంతం చేయటానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now