వనపర్తి జిల్లా కలెక్టర్ మరియు ఫారెస్ట్ అధికారులపై విచారణకు హాజరు కాకపోవడంపై
జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్
*బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్*
నెల రోజుల క్రితం వనపర్తి జిల్లా ఫారెస్ట్ అధికారులపై గిరిజన రైతులకు ఇబ్బందికి గురి చేస్తున్నారని ఫిర్యాదు చేయడం జరిగింది . దానికి జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించి ఫారెస్ట్ అధికారులపై మరియు వనపర్తి జిల్లా కలెక్టర్కు గారికి విచారణకు హాజరుకావాలని నోటీసు జారీ చేయడం జరిగింది నోటికి నోటీసుకు స్పందించని జిల్లా ఫారెస్ట్ అధికారి పై మరియు జిల్లా కలెక్టర్ గారిపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అయ్యారు వెంటనే పై అధికారులు కు నోటీసు జారీ చేస్తామని ాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు శ్రీ హుస్సేన్ నాయక్ గారు చెప్పడం ఈరోజు ఢిల్లీలో జరిగిన హియరింగ్ విచారణలో వనపర్తి జిల్లా కలెక్టర్ గారు మరియు ఫారెస్ట్ అధికారులు హాజరు కావాల్సి ఉండగా, ఆయన విచారణకు గైర్హాజరుకావడం తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిన విషయం అని బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ గారు పేర్కొన్నారు.
వనపర్తి జిల్లా పెద్దగూడెం క్రిష్ణగిరి తండాకు చెందిన గిరిజనులను ఇబ్బందులను గురి చేస్తున్నారని దాదాపుగా ఈ భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు నుంచి అక్కడ లంబాడా బిడ్డలు సాగు చేస్తున్న భూములను ఇబ్బందులను గురి చేస్తున్నారని గిరిజన భూములను ఎవరు కూడా లాక్కోవద్దని గిరిజన బిడ్డలను చేయకూడదని గిరిజన సంఘ నాయకులు తమ వాదనలు వివరంగా కమిషన్‌కు వినిపించారు. పోలీసులు అధికారు లు వారి బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం, ప్రత్యేకించి గిరిజనులపై వేధింపుల కేసుల్లో విచారణకు హాజరుకాకపోవడం అత్యంత తీవ్రమైన ఛర్యగా పేర్కొన్నారు.
“ఇది కేంద్ర స్థాయి కమిషన్ విచారణ. ఇటువంటి విషయంలో హాజరు కాకపోవడం ఒక దురదృష్టకరమైన వ్యవహారం. ఇది ఒక విధంగా గిరిజనులపై వివక్ష చూపుతున్న వనపర్తి జిల్లా అధికారుల పట్ల విశ్వాసం కోల్పోయేలా చేస్తోంది” అని శివ నాయక్ గారు అన్నారు.
ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ గారు, విచారణలో అధికారుల హాజరు విషయాన్ని సీరియస్‌గా పరిగణించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో గిరిజన సంఘం నాయకులు మోహన్ నాయక్ , శ్రీకాంత్ నాయక్ పాల్గొని, తమ ఆవేదనను మరియు చట్టబద్ధమైన డిమాండ్లను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.