జాతీయ వడ్డెర సంఘం కామారెడ్డి పట్టణ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
అధ్యక్షుడిగా దండుగుల బాలయ్య… ఇతర పదవుల్లో పలువురు నాయకుల ఎంపిక
కామారెడ్డి, జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం జనవరి 1 (2026):
జాతీయ వడ్డెర సంఘం పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు చెల్లె ఎల్లయ్య గారు, రాష్ట్ర నాయకులు గుంజా శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ నూతన కార్యవర్గాన్ని గురువారం పట్టణంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జాతీయ వడ్డెర సంఘం కామారెడ్డి పట్టణ నూతన అధ్యక్షుడిగా దండుగుల బాలయ్య, ఉపాధ్యక్షులుగా కొమ్మరాజుల రాజు, మక్కల శ్రీను, ప్రధాన కార్యదర్శిగా బోదాసు సురేష్, కార్యదర్శిగా దండ్ల రాజును ఎంపిక చేశారు. అలాగే ముఖ్య సలహాదారులుగా రాజ్ కుమార్, త్యపల్ల నర్సింలు, కార్యవర్గ సభ్యులుగా ఉప్పు రాములు, దండ్ల లంక రాములులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వడ్డెర సంఘం బలోపేతం, సంక్షేమ కార్యక్రమాల అమలు, హక్కుల సాధనకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ వడ్డెర సంఘం జిల్లా నాయకులు బోదాసు నవీన్, చందు, బాలు తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.