జాతీయ యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ వేడుకలు
యువతే ఒక శక్తి, యువతే దేశ భవిష్యత్తు
యువత కొత్త ఆలోచనలతో, ఆవిష్కరణలతో ముందుకు సాగాలి
యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్
జమ్మికుంట ఆగస్టు 9 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, యువజన కాంగ్రెస్ జెండాను యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్ ఆవిష్కరించారు అనంతరం రాఖీ పౌర్ణమి సందర్భంగా, సమ సమాజ స్థాపనకు నిత్యం కృషి చేసిన సమత ఐక్యత మూర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి యువజన కాంగ్రెస్ నాయకురాలు రాఖీ కట్టారు యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మన దేశంలోనే యువత నాయకత్వం వహిస్తున్న, అత్యంత బలమైన ఆర్గనైజేషన్ గా యువజన కాంగ్రెస్ ముందు వరుసలో ఉందనీ యూత్ కాంగ్రెస్ ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా, సబ్బండ వర్గాల యువత దేశం నలుమూలల నుండి కోట్లాదిగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ లో భాగస్వాములు కావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, యువజన కాంగ్రెస్ ముఖ్య భూమిక పోషించిందనీ కొనియాడారు. యువజన కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటిదనీ యువతతోనే ఏదైనా సాధ్యమవుతుందని, ఈ దేశ దశ దిశను మార్చేది యువతే నని గట్టి సంకల్పంతో యువతలో ఉత్సాహాన్ని నింపుతూ, యువతలో మరింత రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడం కోసం రాహుల్ గాంధీ ఏనలేని కృషి చేస్తున్నారని, రాబోయే రోజుల్లో దేశ ప్రజలందరి ఆశీర్వాదాలతో దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డే సంధ్యా నవీన్, పర్లపెల్లి నాగరాజు, జిల్లా కార్యదర్శి సజ్జు, తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్, ఫిషర్మెన్ కాంగ్రెస్ పింగిలి రాకేష్, హుజురాబాద్ నియోజకవర్గ కార్యదర్శి రోమాల రాజ్ కుమార్, జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, ఆకినపల్లి శ్యామ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి వెంకటేష్, యువజన నాయకులు పాతకాల ప్రవీణ్, సురేష్, జావిద్, సతీష్, బషీర్, వెంకటేష్, అశోక్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.