జాతీయ యువజన దినోత్సవ వేడుకలు
సిద్దిపేట జిల్లా, 12 జనవరి 2025 : యువసేన యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత, యువత లో అంతర్గత శక్తిని తన ప్రబోధాల ద్వారా మేల్కొలిపిన మహనీయుడు స్వామి వివేకానంద గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా కుకునూర్ పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు అనుముల సంపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువసేన యూత్ అధ్యక్షుడు సంతోష్ కుమార్, గోపాల్ రెడ్డి, సంజు గౌడ్, రమేష్, ఆనంద్, వెంకటేష్, నాగరాజు, కరుణాకర్, రాజు ,యువసేన మరియు శివాజీ మహారాజ్ యువజన విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.