వామ్మో! పగలు పనులు, రాత్రిళ్లు చోరీలు – రెచ్చిపోతున్న పనులు కోసం పక్క రాష్ట్రాలు నుండి వచ్చిన స్థానికేతరులు

*వామ్మో! పగలు పనులు, రాత్రిళ్లు చోరీలు – రెచ్చిపోతున్న పనులు కోసం పక్క రాష్ట్రాలు నుండి వచ్చిన స్థానికేతరులు*

డబ్బుల కోసం పగటి పూట పనులు చేస్తూ రాత్రుళ్లు చోరీలు చేస్తున్న స్థానికేతరులు – మహిళల మెడల్లో గొలుసులు, తాళం వేసిన ఇళ్లే టార్గెట్!

గుంటూరు, విజయవాడ

వివిధ రాష్ట్రాల నుంచి బతుకుతెరువు కోసం వచ్చిన పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. పగటి పూట పనులు చేస్తూ రాత్రుళ్లు డబ్బుల కోసం చోరీలు చేస్తున్నారు. మహిళల మెడల్లో గొలుసులు తెంచుకెళ్లడం, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరు ఎక్కువగా మురికివాడల్లో ఉంటూ, ఫుట్‌ఫాత్‌లపై నిద్రిస్తూ ఈ చోరిలు చేస్తున్నారు.

తాజాగా గుంటూరులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పలువురు నగరంలో ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వేరే రాష్ట్రాల వారు తమ ప్రాంతాల వారికే పనిలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ వీరి వివరాలేవీ యజమానుల వద్ద ఉండడం లేదు. వెరసి వీరిలో చాలా మంది నేరాలకు పాల్పడి పరారవుతున్నారు. అనంతరం వీరిని పట్టుకోవడం పోలీసులకు సైతం కష్టంగా మారుతోంది. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఎక్కువ మంది నకిలీ గుర్తింపు కార్డులతో నగరంలో వాలిపోతున్నారు. వీరిలో అత్యధికులు బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా సరిహద్దు దాటొచ్చి ఇక్కడ నేరాలకు పాల్పడి పారిపోతున్నారు.

50 వేల మంది స్థానికేతరులు : విజయవాడలో నిర్మాణ రంగం, ఫ్యాన్సీ దుకాణాలు, బంగారు నగల తయారీ, హోటళ్లు, ఆటోమొబైల్, విద్యుత్తు ఉపకరణాలు, గృహాలంకరణ, మగ్గాలు, తదితర వృత్తుల్లో స్థానికేతరులు దాదాపు 50 వేల మంది పనిచేస్తున్నారు. ఇక్కడ నగల వ్యాపారం బాగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్‌ వ్యాపారులే బంగారం కార్ఖానాలు నడుపుతున్నారు. వీటిల్లో బెంగాలీలనే నియమించుకుంటున్నారు. తర్వాత మహారాష్ట్ర వారూ ఉన్నారు.

మగ్గాలపై డిజైన్లు వేసే పనుల్లో బెంగాల్‌ వారు, అలాగే హోటళ్లలో కర్ణాటక వారు ఉపాధి పొందుతున్నారు. నగరం, సమీప ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, భవనాల నిర్మాణాల్లోనూ బీహార్‌, చత్తీస్‌గఢ్ కూలీలే అధికం. తక్కువ వేతనాలకు వీరు వస్తుండడమే కారణం. ప్లైవుడ్, వడ్రంగి, ఇళ్లల్లో ఇంటీరియర్, చలువరాతి పరిచే పనులు, మరుగుదొడ్లలో బిగింపు పనులలో రాజస్థాన్, మహారాష్ట్ర కార్మికులు పనిచేస్తున్నారు.

ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్‌ దుకాణాలు మహారాష్ట్ర, రాజస్థాన్‌ వారే నిర్వహిస్తూ పనికి ఆయా రాష్ట్రాల వారినే పెట్టుకుంటున్నారు. ఆటోనగర్‌లో వాహనాల బాడీ బిల్డింగ్‌ యూనిట్లు, మరమ్మతుల్లో ఇతర రాష్ట్రాల వారు ఉపాధి పొందుతున్నారు. ఆటోనగర్‌లో ఓ మురికివాడలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధి పొందే వారి కాలనీ ఉంది. ఎక్కువ మంది కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల వారే ఉన్నారు.

పగలు పనులు, రాత్రుళ్లు చోరీలు : వివిధ పనులు చేస్తున్న వారిలో ఎక్కువ మంది నేరాలకు పాల్పడుతున్నారు. వీరు పగటి పూట పనులు చేస్తూ రాత్రుళ్లు డబ్బుల కోసం చోరీలు చేస్తున్నారు. వీరి వివరాలేవీ తీసుకోకుండా యజమానులు పనిలో పెట్టుకుంటున్నారు. కేవలం వేతనాలు చెల్లించి చేతులు దులుపుకొంటున్నారు. ఇతర రాష్ట్రాల వారి ఆధార్‌ లేదా ఓటరు కార్డులు తీసుకోవడం లేదు. వారి సమాచారాన్ని దాచడం లేదు. ప్రత్యేక గుర్తింపు కార్డుల జారీ ప్రతిపాదన అమలుకు నోచలేదు.

వన్‌టౌన్‌లో ఓ నగల దుకాణంలో పనిచేసే కార్మికుడు మూడు కిలోల బంగారం తీసుకుని కార్ఖానాకు బయలుదేరాడు. కార్ఖానాకు వెళ్లకుండా బంగారంతో స్వస్థలానికి ఉడాయించాడు. నెల కిందట వన్‌టౌన్‌లోనే ఇదే రీతిలో మరో కార్మికుడు రెండు కిలోల బంగారంతో పారిపోయాడు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. దీంతో కేసు కూడా నమోదు కాలేదు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment