26 నుంచి 30వ తేదీ వరకు నవీపేట్ రైల్వే గేట్ మూసివేత

26 నుంచి నవీపేట్ ప్రధాన రైల్వే గేట్ మూసివేత…30వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపు.

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్: 26 అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నందున నవిపేట్ వద్ద గల 188 నెంబర్ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేట్ ఐదు రోజులపాటు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సంబంధిత సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి. శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 26న నుంచి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రైల్వే గేట్ మూసివేయబడుతుందని అన్నారు. దీనిని దృష్టిలో ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు కమలాపూర్ , మహంతం, మోకాన్ పల్లి, గుండారం మీదుగా ఇతర వాహనదారులు కళ్యాపూర్, సాట్టాపూర్, తాడ్ బిలోలి, ఫకీరాబాద్ మీదుగా రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ప్రయాణికులు దారి మళ్లింపును పాటిస్తూ తమ వంతు సహకారం అందించాలని సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి. శ్రీనివాస్ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment