మత ప్రచారాలు అడ్డాగా మారిన నవజ్యోతి స్కూల్

*మత ప్రచారాలు అడ్డాగా మారిన నవజ్యోతి స్కూల్*

* ఏబీవీపీ హిందూ సంఘాలు ఆందోళన

* ఎంఈఓ రాజి రెడ్డికి ఫిర్యాదు..

ముస్తాబాద్ డిసెంబర్ 21ప్రశ్న ఆయుధం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలోని నవజ్యోతి పాఠశాల లో శుక్రవారం నాడు సాయంత్రం సమయాన పాఠశాల ఆవరణంలో మత ప్రచారం చేస్తూ పాస్టర్ లతో బైబిల్ బైబిల్ బోధనలు పాఠశాలలో బోధించారు.ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ అదే విధంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా హాస్టల్ నడిపిస్తున్నారు. పాఠశాల బిల్డింగ్ కు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఫైర్ సర్టిఫికెట్ లేకుండా భవనం పూర్తి కాకుండా పాఠశాల విద్య బోధన కొనసాగిస్తున్నారు పాఠశాల లోపల యాజమాన్యం నివాసంగా ఉంటున్నారు. నవజ్యోతి పాఠశాల పక్కకు కెనాల్ ఉండడం వల్ల విద్యార్థులు వెళ్లే పాఠశాల బస్సు ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది ప్రమాదం జరుగుతే దీనికి ఎవరు బాధ్యులు తీసుకుంటారు అని అన్నారు. గతం లో కూడా జిల్లాలో మండలాల్లో ఇలాంటి ఘటన లు చాలా జరిగాయి జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ ,జిల్లా కన్వీనర్ లోపేల్లి రాజు రావు, బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజ గౌడ్, హిందూ సంఘల నాయకులు , మద్దికుంట రమేష్ బోల్గంపని కిషోర్, బండారి రాజేష్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now