కవితకు బెయిల్ రావడం వర్షం వ్యక్తం చేసిన ఎన్సీ సంతోష్

కవితకు బెయిల్ రావడం హర్షం వ్యక్తం చేసిన ఎన్సీ సంతోష్

గజ్వేల్ ఆగస్టు 28 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బిఆర్ఎస్ నాయకులు ఎన్సీ సంతోష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం హర్షణీయమైన విషయమని దీనిని మేము స్వాగతిస్తున్నామని అన్నారు. న్యాయం గెలిచిందని సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఎలాంటి అభియోగాలు లేకున్నా ఒక మహిళ అని చూడకుండా ఆరు నెలలు జైల్లో పెట్టడం తన కుటుంబానికి దూరం చేయడం సబబు కాదన్నారు. దేశ ప్రజలకు సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థల పైన ఎంతో అపారమైన నమ్మకం ఉందని అలాంటి సంస్థలు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయకుండా తప్పుడు అభియోగాలు పెట్టారని అందుకు సుప్రీంకోర్టు సరియైన న్యాయం ఇచ్చి బెయిల్ మంజూరు చేయడం ఆ సంస్థలకు చెంపపెట్టు అని అన్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు టిఆర్ఎస్ పార్టీని అంతమొందించాలని కేసులు పెట్టి ఇబ్బంది గురి చేస్తున్నారని అలాంటి కేసులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని భయపడే సమస్య లేదని ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యం లాగా బయటికి వచ్చారని ఇందుకు నిదర్శనం అన్నారు. భవిష్యత్తులో పార్టీ అధినేత కేసిఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత గార్ల నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పే విధంగా మా కార్యచరణ ఉంటుందన్నారు. అనంతరం పార్టీ నాయకులతో కార్యకర్తలతో మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి,అత్తెలి వెంకటేష్, సతీష్, కొమురవెల్లి ప్రవీణ్, బాకీ స్వామి, కరీం, మర్రి స్వామి, బొజ్జా రవి గౌడ్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now