కన్నాయాదవ్ ను పరామర్శించిన ఎన్ సీ సంతోష్
గజ్వేల్, 11 జనవరి 2025 :
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ కు చెందిన యాదవ సంఘం నాయకుడు కన్న యాదవ్ తండ్రి ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ గురువారం కన్న యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో పాటు నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.