5 కే రన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని
జగదీశ్వర్ గౌడ్,శ్రీమతి పూజిత గౌడ్ మరియు బండి రమేష్ లను ఆహ్వానించిన శ్రీమతి శిరీష సత్తూర్
మార్చ్ 16వ తేదీ అదివారం ఉదయం 6 గంటలకు అల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని తులసి వనం నందు అవని ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5 కే రన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి.జగదీశ్వర్ గౌడ్ ని, హఫీజ్పేట్ కార్పొరేటర్ శ్రీమతి పూజిత గౌడ్ ని కలిసి ఆహ్వానించిన ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి శిరీష సత్తూర్. బుధవారం రోజున బాలనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, తూము వేణు, రాఘవేందర్, సతీష్ గౌడ్, శివ చౌదరి ,అజాజ్ తదితరులు పాల్గొన్నారు.