Site icon PRASHNA AYUDHAM

ఇవి అన్ని వదిలి జర్నలిస్టుల కోసం మాట్లాడం అవసరమా ?.. కెఏ పాల్

Screenshot 2025 03 16 22 53 31 953 edit com.whatsapp

ముఖ్యమంత్రి రేవంత్ నువ్వు చేసే పని చేయి

– అభివృద్ధి చేయకుండా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటావు

– రాష్ట్రంలో విద్యా, వైద్యం కనిపించడం లేదు

– మంచినీళ్ల కష్టాలు చెప్పనవసరం లేదు

– రాష్ట్రంలో రైతుల, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి

– ఇవి అన్ని వదిలి జర్నలిస్టుల కోసం మాట్లాడం అవసరమా ?

– నీకోసం వరంగల్ లో నేను పోటీ చేయలేదు

ముఖ్యమంత్రి రేవంత్ తమ్ముడు నువ్వు చేసే పనులు సరిగ్గా చెయ్యి అంతేకానీ జర్నలిస్టుల గురించి మాట్లాడడం ఏమిటి అని శాంతి దూతగా పేరొందిన కేఏ పాల్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తన ఈ పోస్టు ముఖ్యమంత్రికి చేరేవరకు ప్రతి ఒక్కరూ ఎలా వీలైతే అలా ముఖ్యమంత్రికి చేరేలా ప్రచురించాలని ఆ వీడియోలో చివరికి కోరారు. నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం విడ్డూరంగా ఉందని రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేశారని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని ఉంటానని అంటున్నావు అన్నారు. రాష్ట్రంలో విద్యా వైద్యం కనిపించడం లేదన్నారు. మార్చి 15 లోనే మేము నివాసముంటున్న అమీర్పేటలో నీళ్లు లేక ట్యాంకర్ల ద్వారా నీటిని పోయించుకుంటున్నామని ఇక ఏప్రిల్ మే లో నీటి కష్టాలు ఎలా ఉంటాయో తలుచుకుంటూనే జనాల గుండెలు అదిరిపోతున్నాయి అన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులు ఉద్యోగం రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే, రైతులు తమ పంటల కోసం పెట్టిన పెట్టుబడులు రాక ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. నీవు గెలిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావని అన్ని కష్టాలు తీరుస్తావని నేను వరంగల్ లో పోటీ చేయకుండా నీకు వెన్నుదన్నుగా నిలిచాను అన్నారు. మొదటగాని దృష్ట్యంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. కొద్ది నెలల్లోనే నీవు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యావ్ అని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇవన్నీటిని వదిలిపెట్టి నకిలీ జర్నలిస్టులు అంటూ మాట్లాడడం సరైనది కాదన్నారు. ఒక శాంతి దూతగా నీ సలహాదారునిగా నాకు ఎంతో బాధ వేస్తుంది అన్నారు. రాష్ట్రంలో అప్పులు తీర్చేందుకు, విద్య, వైద్యాన్ని బాగు చేసేందుకు ముందుగా కృషి చేయాలని ఆయన సూచించారు.

Exit mobile version