సూదిలేని రక్తపరీక్ష – నిలోఫర్‌ ఆసుపత్రిలో నూతన పరికరం ప్రయోగం

*సూదిలేని రక్తపరీక్ష – నిలోఫర్‌ ఆసుపత్రిలో నూతన పరికరం ప్రయోగం*

హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో, దేశంలో తొలిసారిగా సూదితో పొడవకుండానే రక్తపరీక్షలు చేసే ఏఐ ఆధారిత పీపీజీ పరికరం (ఫొటో ప్లెథిస్మోగ్రఫీ)ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. క్విక్‌ వైటల్స్‌ సంస్థ రూపొందించిన ఈ సాధనం ముఖాన్ని 30–40 సెకన్లు స్కాన్‌ చేసి బీపీ, ఆక్సిజన్‌ స్థాయి, హార్ట్‌బీట్‌, హిమోగ్లోబిన్‌ తదితర vital signs తక్షణమే చూపిస్తుంది. మొదటి విడతగా వెయ్యి మంది పిల్లలపై పరీక్షలు నిర్వహించి ఫలితాలను విశ్లేషిస్తామని నిలోఫర్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. ఈ విధానం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నది.

Join WhatsApp

Join Now