మత్స్య సంఘం భవనం ప్రారంభించిన నీలం మధు

మత్స్య
Headlines
  1. మెదక్‌లో మత్స్య సంఘం భవన ప్రారంభం
  2. మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం
  3. చెరువుల్లో చేపల పెంపకానికి ప్రభుత్వం సహకారం – నీలం మధు
  4. కార్తీక మాస వన బోజనాలలో ఐక్యతకు ప్రాధాన్యం
  5. మత్స్యకారుల అభివృద్ధి కోసం ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని పిలుపు
మత్స్యకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.

గురువారం జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ సుంకరబోయిన మహేష్  ఆధ్వర్యంలో మత్స్య సంఘం భవన ప్రారంభోత్సవం తో పాటు సత్యనారాయణ వ్రతం కార్తీక మాస వన భోజనాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. మత్స్యకారుల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో చేపల పెంపకానికి చేప పిల్లల పంపిణీ ప్రక్రియను ప్రారంభించిందని, మత్స్యకారుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్తీక మాసం సందర్భంగా శివ కేశవులని పూజిస్తూ ఏర్పాటు చేసిన వన బోజనాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వన బోజనాలు ఐక్యతను సూచించడంతో పాటు మనషుల మధ్య స్నేహభావం పెంపొదిస్తుందని తెలిపారు. మనం ఐకమత్యంగా ముందుకు కదిలితేనే సమాజంలో మన జాతికి గుర్తింపు లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పులిమామిడి రాజు జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ గంగు రమేష్ కాంగ్రెస్ నాయకులు ఎట్టయ్య మండల అధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్ గారెల మల్లేష్ మాణిక్యరావ్ లక్ష్మణ్ యాదవ్, వెంకటేశ్ అశోక్ గణేష్ వీరేష్ పూజరి రాజు సాయి శ్రీశైలం రఘు మహిళలు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment