*టీ టైం షాపును ప్రారంభించిన – నీలం మధు*
సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత స్వయం ఉపాధి ఎంచుకొని వ్యాపార రంగంలోకి ప్రవేశించడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామానికీ చెందిన ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు సత్యానారాయణ ఏర్పాటు చేసిన టీ టైం షాపును ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధిని ఎంచుకోవడం ద్వారా తమ సొంత కాళ్లపై తాము నిలబడడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎన్ఎంఆర్ యువసేన సభ్యుడు ప్రారంభించిన ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆయన అభిలాషించారు. ఈ కార్యక్రమంలో భూపాల్ రెడ్డి, సంజీవ రెడ్డి, నరేష్ రెడ్డి, లక్ష్మణ్, యాదయ్య గౌడ్, నాగరాజు,ముత్యాలు,నాగభూషణం, లక్ష్మణ్, బాబు, విఘ్నేష్ కుమార్,శ్రీనివాస్ ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.