పాస్‌పోర్టు విచారణలో నిర్లక్ష్యం  – హెడ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

పాస్‌పోర్టు విచారణలో నిర్లక్ష్యం

– హెడ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

– కామారెడ్డి   గత ఏడాది పాస్‌పోర్టు విచారణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు హెడ్ కానిస్టేబుల్ పి.కృష్ణ, హెచ్‌సి ను ఇంచార్జ్ డిఐజి సన్ ప్రీత్ సింగ్, సస్పెండ్ చేయడం జరిగిందనీ జిల్లా ఎస్పీ యొక్క ప్రకటన తెలిపారు. 

పి. కృష్ణ హెడ్ కానిస్టేబుల్ గత ఏడాది కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో, టేకుల రాజయ్య పాస్‌పోర్టు దరఖాస్తు పై విచారణ చేయువిషయములో తీవ్ర నిరక్షంగా వ్యవహరించారన్నారు. కనీస ప్రాథమిక పరిశీలన లేకుండానే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సమగ్ర విచారణ చేయలేకపోవడం వలన రాజయ్యకు అంతకు ముందే రాజు పేరుపై ఉన్న పాస్‌పోర్టు గురించి తెలుసుకోలేకపోయారు. తదుపరి రాజయ్య పై ఆర్.జి.ఐ ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఈ విషయములో తన దృష్టికి వచ్చి పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని ఇంచార్జ్ డిఐజి కి నివేదిక పంపించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన ఇంచార్జ్ డి ఐ జి , బాధ్యతారాహిత్యానికి బాధ్యుడైన హెడ్ కానిస్టేబుల్ పి. కృష్ణను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ డిఐజి సన్ ప్రీత్ సింగ్, మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినవారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా పోలీసు శాఖ సమర్థంగా పనిచేస్తుందని, బాధ్యత లేకుండా ప్రవర్తించే పోలీసు అదికారులు, సిబ్బంది పై నిరంతరం నిఘా ఉంటుందని ఇంచార్జ్ డి ఐ జి స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now