అధికారుల నిర్లక్ష్యమా…? ప్రజా ప్రతినిధుల అండనా…?

హైడ్రా హైదరాబాద్ కె పరిమితమా మరి జిల్లాలకు లేదా …..?

హైదరాబాద్ లో హైడ్రా ప్రారంభమై అప్పుడే నెల రోజులు అవుతుంది హైడ్రా కేవలం హైదరాబాద్ కేనా లేక పేరు మార్చుతూ జిల్లాలకు ఏదైనా జీవో ఉంటుందా….? అనే దానిపై జిల్లాలో చర్చ మొదలైంది. హైదరాబాదులో హైడ్రా తరహా లో కామారెడ్డి లో కూడా
(కా డ్రా ) పేరు తో చర్యలు ఏమైనా చేపట్టనున్నారా అనే దానిపై ప్రజల్లో చేర్చనీయాంశం .
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిల్డర్స్ గుండెల్లో గుబులు ప్రారంభమైంది

అధికారుల నిర్లక్ష్యమా...? ప్రజా ప్రతినిధుల అండనా...?
కామారెడ్డి శివారు ప్రాంతాలలో ఉన్నటువంటి కామారెడ్డి పెద్ద చెరువును పెద్ద చెరువు కాలువను ఆనుకొని లేవట్ల పేరిట ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్న కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు ఆనుకొని ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ల లో సుమారు రెండు ఎకరాలు ఎఫ్ టి ఎల్ భూములు ఉన్నట్టు ఆరోపణలు ఉన్న అధికారులు ఎందుకు స్పందించడం లేదు నేడు కామారెడ్డి చెరువు నిండుగా పొంగి పొర్లి ఎఫ్ టీ ఎల్ కు సంబంధించినటువంటి భూమిలో పూర్తిగా నీళ్లు నిండిన వైనం వెలుగులోకి వచ్చింది రాధాకృష్ణ నగర్ అనే పేరుపై వెంచర్ నిర్వహించిన దాంట్లో ఎఫ్ టి ఎల్ కు సంబంధించినటువంటి భూములు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి చెరువు నిండిన క్రమంలో ఈ వెంచర్ లోకి పక్కనున్నటువంటి జి అర్ కాలనీలోని ఇండ్ల లోకి నీరు వచ్చి చేరిన పట్టించుకోని ఆ శాఖ అధికారులు.

అధికారుల నిర్లక్ష్యమా...? ప్రజా ప్రతినిధుల అండనా...?

రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమాలకు పాలు పడుతున్న వారి పై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజల్లో ఈ వెంచర్ పై చర్చనీయాంశంగా మారింది కామారెడ్డి నుండి సారంపల్లి మీదుగా చిన్న మల్లారెడ్డి వెళ్లే దారిలో రాధాకృష్ణ నగర్ అనే వెంచర్లో ఎఫ్ టి ఎల్ భూములకు సంబంధించినా భూమి ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి ఇదే యజమాని కామారెడ్డి లోని అశోక్ నగర్ కాలనీలో హనుమాన్ టెంపుల్ కు ఆనుకొని ఉన్నటువంటి 28/82 లేఅవుట్ భూమిలో షెడ్డు వేసుకొని కబ్జా చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి మున్సిపల్ అధికారుల ఇచ్చిన టౌన్ ప్లానింగ్ మ్యాప్ ప్రకారంగా ఆ భూమి ఓపెన్ ప్లేస్ లో ఉంది షెడ్డు కూడా గుడి పక్కన కబ్జా చేసి కట్టుకున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్న ఇప్పటివరకు మున్సిపల్ శాఖ అధికారులు స్పందించకపోవడం శోచనీయం

అధికారుల నిర్లక్ష్యమా...? ప్రజా ప్రతినిధుల అండనా...?

ఒక ప్రభుత్వ ఉద్యోగి కబ్జాలు చేయటం షెడ్లు వేయటం ఎఫ్ టి ఎల్ భూములు అమ్ముకోవటం ఇది ఒక ఆరోపణల లాగా కాకుండా ఆధారాలతో టౌన్ ప్లానింగ్ మ్యాప్ లో ఓపెన్ ల్యాండ్ అనేది మ్యాప్ లో స్పష్టంగా కనిపిస్తున్న అధికారులు భూములను ప్రభుత్వ పరం చేసుకోకపోవడం తో సంబంధిత ఉద్యోగులతో కుమ్మక్కు అయ్యారు అనే ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ పరం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇదే విషయమై పలుమార్లు మీడియాలలో పేపర్లలో వార్తలు వచ్చిన నేటికి స్పందించని అధికారులు కామారెడ్డి శివారు ప్రాంతంలో ఒకటి కాదు రెండు కాదు ఇలా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లను తయారుచేసి అమాయకమైన ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అని ఆరోపణలు ఉన్నాయి కామారెడ్డి సిరిసిల్ల రోడ్ బ్రిడ్జి వద్ద వాగు ప్రాంతంలో కూడా సదరు రియల్ ఎస్టేట్ భూమిలో ప్లాట్లను చేసి విక్రయించిన స్థలంలో కూడా ఎఫ్ టి ఎల్ పరివాహక ప్రాంతము ఉన్నటువంటి భూమిలోకి ఈరోజు నిండుగా నీరు చేరడంతో దానిపై కూడా చర్యలు చేపట్టకపోవడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది నీటి పరివాహక ప్రాంతం అయినటువంటి కలెక్టరేట్ నుండి వచ్చే వర్షాభావ నీటి పరివాహక ప్రాంతం జయశంకర్ కాలనీ నీరు వెళ్లకుండా ఇండ్లు

అధికారుల నిర్లక్ష్యమా...? ప్రజా ప్రతినిధుల అండనా...?

నిర్మించడం నాళాలు మూసివేయడం మూసివేసి కొత్తగా ఇల్లు నిర్మాణం చేసినటువంటి ప్రాంతాలలో రాత్రికి రాత్రి భారీ వర్షాలు పడడంతో పూర్తిగా నీటిమయమై ఇండ్లలోకి నీరు చేరిన వైనం ఆదివారం రోజు వెలుగులోకి వచ్చింది అక్కడి నుండి ప్రవహిస్తున్నటువంటి నీరు జయశంకర్ కాలనీ లిమ్రా గార్డెన్ వద్ద గతంలో ఒక చిన్న కుంటగా నిండి కాలువ ద్వారా నీరు బయటకి వస్తుండే అని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ నీరు బయటకి రాకుండా మైసమ్మకుంటను మూసివేసి అక్కడ అక్రమ కట్టడాలు కట్టారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి మైసమ్మకుంటను కూడా కనిపించకుండా చేసినటువంటి రియల్ రియల్ ఎస్టేటర్ల పై అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది వీటన్నిటికీ కారణం కామారెడ్డిలో రాజకీయ నాయకుల అండదండలు ఉన్న రియల్ ఎస్టేటర్లు మాత్రమే ఇలాంటి కుంటలను కాలువలను కబ్జాలు చేస్తున్నారు అని ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి వేచి చూడాలి ఈ అక్రమ లేఔట్లు లో ఎఫ్ టి ఎల్ భూములను సంబంధిత అధికారులు ప్రభుత్వ పరం చేస్తారా లేదా, స్పందిస్తారా లేదా…..?

Join WhatsApp

Join Now