Headlines in Telugu:
-
ఆకుల నాగరాజు బెదిరింపులపై సామల కవిత దామోదర్ ఫిర్యాదు
-
ఇంటి నిర్మాణంలో అవరోధాలపై సామల కవిత ప్రజావాణిలో ఫిర్యాదు
-
“మాకు న్యాయం చేయండి సారు” – జిల్లా కలెక్టర్ నుండి న్యాయం కోరిన సామల కవిత
-మాకు న్యాయం చేయండి సారు
-ఆకుల నాగరాజు వల్ల మాకు ప్రాణం అని ఉంది
కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం నవంబర్ 04:
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రజావాణిలో పొరుగింటి ఆకుల నాగరాజు పై ఫిర్యాదు చేసిన సామల కవిత దామోదర్. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36 వార్డులో సామల కవిత దామోదర్ కొత్తగా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇంటి పక్కన గల ఆకుల నాగరాజు అతని భార్య వారి ఇద్దరు కుమారులు దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 6 లక్షలు రూపాయలను ఇవ్వాలని ఆకుల నాగరాజు డిమాండ్ చేసారని అన్నారు. అందుకు నిరకరించడంతో మమల్ని ఇబ్బంది లకు గురిచేస్తున్నారు.ఇంటి పని చేసే మేస్త్రి లను బూతుమాటలతో తిట్టడం పట్ల ఎందుకు తిడుతున్నారని అడగడంతో తనపై ఆకుల నాగరాజు అతని కుటుంబ సభ్యులు నలుగురు తనపై దాడి చేశారని ఆరోపించారు. అందుకే ప్రజావాణి లో పిర్యాదు చేశాము అన్నారు.ఇల్లు నిర్మించినప్పటి నుండి ప్రతిరోజు కావాలని గొడవ చేస్తున్నాడని, డబ్బులు ఇవ్వకపోతే ఇంటి నిర్మాణం జరగకుండా చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. నన్ను కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్లీ నా దగ్గరికి రావాల్సిందేనని అంటున్నాడని వాపోయారు. మా దగ్గర మేము ప్లాట్ కోన్నటువంటి ఇంటి పేపర్లు ఉన్నాయని దాని ప్రకారమే మున్సిపల్ నుండి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరుగుతుందని దయచేసి జిల్లా కలెక్టర్ అధికారులు తమకు న్యాయం చేయగలరని, నాగరాజు ఫ్యామిలీ ద్వారా మాకు ప్రాణహాని ఉందని మాకు న్యాయం చేయాలని కోరారు.