Site icon PRASHNA AYUDHAM

మట్టి గణపతిని ప్రతిష్టించిన నెంటూర్ హనుమాన్ భక్త బృందాన్ని

IMG 20240910 WA0410

సన్మానించిన రామకోటి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు

గజ్వేల్ సెప్టెంబర్ 10 ప్రశ్న ఆయుధం :

మట్టి గణపతులనే వాడాలని గత 20సంవత్సరాల నుండి ప్రచారాన్ని నిర్వహించి మట్టి గణపతులను అందిస్తూ భారీ మట్టి వినాయకులను ప్రతిష్టించిన వారిని కూడ ప్రోత్సాహిస్తుంది శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వారు. అందులో భాగంగా మంగళవారం నాడు వర్గల్ మండల్ నెంటూర్ గ్రామానికి చెందిన హనుమాన్ భక్త బృందం వారు భారీ మట్టి గణపతిని ప్రతిష్టించిన సందర్బంగా వారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత 4సంవత్సరాల నుండి కూడ మట్టి విగ్రహాన్నే ప్రతిష్టించి ఎంతో మందికి వీరు స్ఫూర్తి దాయకంగా నిలిచారన్నారు. పర్యావరణ పరిరక్షణలో అందరు బాగాస్వాములు కావాలని కోరారు. ప్లాస్టరప్ ప్యారీస్ వల్ల అనేక నష్టాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్త బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version