కార్తీక మాసంలో అన్ని పూజాలతో పాటు ప్రత్యేక స్థానం వున్నది నేతి బీర

*కార్తీక మాసంలో అన్ని పూజాలతో పాటు ప్రత్యేక స్థానం వున్నది నేతి బీర. అసలు నేతి బీరని కార్తీక మాసంలోనే ఎందుకు తినాలి? కార్తీక మాసంలోనే తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?*
నేతి బీరకాయలో చాలా పోషక విలువలు ఉన్నాయి…
మన శరీరానికి అవసరమైన విటమిన్స్ , పీచుపదార్థాలు,ఫోలిక్ ఆసిడ్ , థయమిన్ లాంటివి ఉంటాయి…
కార్తీకమాసం లో వాతావరణం చల్లగా ఉంటుంది… అలాగే ఎక్కువగా ఉపవాసాలు ఉంటారు… అలా వుండడం వల్ల మన శరీరం లో నీటి శాతం తగ్గుతుంది… శరీరం డీహైడ్రేట్ కూడా అవుతుంది… షుగర్ ఉన్నవాళ్లకు షుగర్ పెరగడం లాంటివి జరుగుతుంటాయి…
అందువల్ల నేతిబీర ను తింటారు… ఇలా తినడం వల్ల మన శరీరం కోల్పోయిన విటమిన్స్, మినరల్స్ అన్నీ నేతిబీర లో ఉండడం వల్ల అది కూడా ఎక్కువగా నేతిబీర చలి కాలం లో నే పంట ఎక్కువ పండుతుంది ..మన శరీరానికి కావలసిన పీచుపదార్థాలు తినడం వల్ల మలబద్దక సమస్యలు దూరం అవుతాయి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల షుగర్ కూడా అదుపులో ఉంటుంది.. అందుకని కార్తీక మాసం లో నేతిబీరకాయ తింటే మంచిది అని పెద్దలు అంటారు..

Join WhatsApp

Join Now

Leave a Comment