Site icon PRASHNA AYUDHAM

మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రకటనలపై నెటిజన్లు ఫైర్

IMG 20250316 WA0077

*మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రకటనలపై నెటిజన్లు ఫైర్*

ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ కు విజ్ఞప్తి

బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ పై సజ్జనార్ ట్విట్టర్ వార్

మాజీ పోలీస్ బాస్ ట్వీట్లతో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల అరెస్టు

మధ్యతరగతి కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెడుతున్న, ఆత్మహత్యలకు కారణమవుతున్న బెట్టింగ్ యాప్ లపై ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వార్ చేస్తున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై సజ్జనార్ మండిపడుతూ ట్వీట్లు పెట్టడంతో పోలీసులు స్పందించి పలువురిని అరెస్టు చేయడం జరిగింది. ట్విట్టర్ ద్వారా ఈ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల మోసాలపై సజ్జనార్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బెట్టింగ్ ఆడి అప్పులపాలు కావొద్దని, జీవితాలను ఆగం చేసుకోవద్దని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సజ్జనార్ కు నెటిజన్లు కీలక విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ మెట్రోలో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రకటనలు తొలగించేలా చూడాలని కోరారు. ‘ఎందరినో బలి తీసుకొని, ఎన్నో కుటుంబాలను ఆగం చేసిన ఈ బెట్టింగ్ మహమ్మారిపై, వాటిని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ ఫ్లూయెన్స‌ర్లపై చేస్తున్న పోరాటానికి మీకు ధన్యవాదాలు సార్. ఒకవైపు మీరు ఈ మాఫియాపై యుద్ధం చేస్తుంటే, మరోవైపు మన హైదరాబాద్ మెట్రోలో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రకటనలు ఇలా కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలకు హైదరాబాద్ మెట్రో ఎలా అనుమతిచ్చింది? దయచేసి దీనిపై చర్యలు తీసుకోగలరు’ అంటూ తరుణ్ రెడ్డి అనే యూజర్ ట్విట్టర్ ద్వారా సజ్జనార్ కు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version