*నేత్రదాత పున్నం సరళ సంస్మరణ సభ*
*జమ్మికుంట జనవరి 13 ప్రశ్న ఆయుధం*

దానంతో ఇద్దరి అంధులకు చూపు ప్రసాదించి వారి జీవితాలలో వెలుగు నింపిన నేత్ర దాత పున్నం సరళ సంస్మరణ సభ సోమవారం కరీంనగర్ జిల్లా, జమ్మికుంట పట్టణం లోని ఎంప్లాయిస్ కాలనిలోని వారి నివాసంలో నిర్వహించారు.నేత్రదాత పున్నం సరళ ఈనెల మూడవ తేదీన మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించి నేత్రదానం చేశారు ఈ సందర్భంగా వారి నివాసంలో సదాశయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మంగళవారం సంస్మరణ సభను ఏర్పాటు చేసి ,వచ్చిన బంధు మిత్రులకు నేత్ర అవయవ శరీర దానాలపై కరీంనగర్ జిల్లా కన్వీనర్ మచ్చ గిరి నరహరి,గర్రెపల్లి వెంకటేశ్వర్లు అవగాహన కల్పించి కుటుంబ సభ్యులకు.జ్నాపికను అందజేశారు.ఈ కార్యక్రమానికి సహకరించిన భర్త పున్నం రాంరెడ్డి,కుమారుడు అనిల్ కుమార్,కూతురు మంద పద్మ భర్త ప్రవీణ్ రెడ్డి, సహకరించిన డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు, చిటికేసి శివానందయ్య చిదురాల శ్రీనివాస్ ముత్యాల జగదీశ్వర్ , వంగల రమేష్ లకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నరహరి అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 13