నిజాంపేట్ లో నూతన సిసి రోడ్లు,డ్రైనేజీ పనులు కు శంకుస్థాపన
కుత్బుల్లాపూర్..ప్రశ్న ఆయుధం..ఆగస్టు 6
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పరిధిలోని రోడ్డు నం.16 వ వార్డు రాజీవ్ గాంధీ నగర్ లో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పూర్తిగా పాడువటంతో బస్తి వాసులు తీవ్ర ఇబ్బంది అవుతుండడంతో బస్తి వాసులు *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని* గత నెల సంప్రదించగా వారి సమ్యసపై స్పందించి మున్సిపల్ ఫండ్స్ ద్వారా సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి మంజూరు చేయించి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అనంతరం బస్తి వాసులు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కోలన్ కృష్ణ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, ఎన్ఎంసి అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కొలన్ జీవన్ రెడ్డి, కొలన్ బాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి, తడకండి సాయిరాజ్, ఎర్రోళ్ల విష్ణు, ఎత్తరి నాని, మొహమ్మద్ షకిల్, బొమ్రాజ్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.