తెలంగాణ భాషా కమిటీకి కొత్త చైర్మన్!

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ కోదండరాం.తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీని ప్రభుత్వం ప్రకటించింది. చైర్మన్ గా ఎమ్మెల్సీ ఎం.కోదండరాంను నియమించింది. కన్వీనర్ గా సంచాలకులు డా.మామిడి హరికృష్ణ వ్యవహరిస్తారు. సభ్యులుగా సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ గుమ్మడి వెన్నెల, సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలు డా. అలేఖ్య పుంజాల, సినీ గీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ, కవి దర్శకుడు బి.నర్సింగరావు, కవి జయరాజ్, రచయిత డా.సంగిశెట్టి శ్రీనివాస్, విమర్శకులు డా.కోయి కోటేశ్వరరావు, రచయిత డా.పసునూరి రవీందర్, జానపద కళాకారులు దరువు ఎల్లన్న, అంతుడుపుల నాగరాజు, ఏపూరి సోమన్న, డా. ఒగ్గు రవి కుమార్, నేర్నాల కిషోర్, పల్లె నరసింహ, దర్శకుడు డా.ఖాజా పాషా, కవి డా.యాకూబ్, రచయిత డా.జూకంటి జగన్నాథం, కళాకారుడు దరువు అంజన్న లను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment