మంత్రి పొంగులేటికి న్యూ డెమోక్రసీ పార్టీ సమస్యలతో కూడిన వినతి

మంత్రి
Headlines
  1. మంత్రి పొంగులేటికి ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించిన న్యూ డెమోక్రసీ
  2. సీతారామ ప్రాజెక్టు నీరు పక్క జిల్లాలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వినతి
  3. పోలీ విప్పే సందేహాలు: గృహ పథకం అమలుకు న్యూ డెమోక్రసీ వినతి
  4. న్యూ డెమోక్రసీ పార్టీ వినతి పత్రం: ప్రభుత్వం స్పందించాలనే వేచి

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

ఇల్లందుకు వచ్చిన మంత్రి పొంగులేటి కి ప్రజా సమస్యలపై వినతి పత్రం అందజేసిన న్యూడెమోక్రసీ బృందం
మార్కెట్ యార్డుకు వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీరుని పక్క జిల్లాలకు తరలించడం సరైనది కాదని ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని,ఆదివాసి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు నీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సీతారామ ప్రాజెక్టు నీరు ఇక్కడ జిల్లా ప్రజలకు ఇవ్వకుండా పక్క జిల్లాల తరలించడం సరైనది కాదని తక్షణమే రీ డిజైన్ చేసి భద్రాద్రి కొత్తగూడెంలోని ఏజెన్సీ ప్రాంతాలకు నీరు ఇవ్వాలని ప్రధానంగా కోరారు.సీతారామ ప్రాజెక్టు సమస్యతోపాటు
పోడు భూముల సమస్య పరిష్కరించాలని,అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ పథకం అమలు చేయాలని కోరారు.
అలాగే సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎస్కే ముక్తార్ పాష స్తూప నిర్మాణానికి ఇసుక తీసుకొస్తున్న లారీలను కొమరారం ఎస్సైరూ,,50,000 ఫైన్ వేశాడు తక్షణమే స్టేషన్లో ఉన్న లారీలను విడుదల చేయాలని వేసిన ఫైన్ ను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునురి మధు, ఖమ్మం వరంగల్ జిల్లలా ఏరియా నాయకులు జె. సీతారామయ్య,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,జిల్లా నాయకులు రాశుద్దిన్,కే సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now