బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యూ లాండ్ ల్యాబరేటరీస్ మెగా జాబ్ మేళాకు మంచి స్పందన
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన న్యూ లాండ్ లాబరేటరీ మెగా జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చిందని కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేఖ్ సలాం పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న జాబ్ మేళాలు నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని నోడల్ అధికారి తెలిపారు. అదేవిధంగా ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 17వ తేదీన, బిచ్కుంద ప్రభుత్వం జూనియర్ కళాశాలలో 18వ తేదీన జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి షేఖ్ సలాం, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు మొహమ్మద్ ఎజాజ్, శ్రీధర్, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ హకీమ్, కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ శివ, అధ్యాపకులు స్వరూప్, సమీ, జూనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాక్, లైబ్రరియన్ కార్తీక్ ,న్యూ ల్యాండ్ ల్యాబరేటరీ సంస్థ ప్రతినిధులు , నిరుద్యోగులు పాల్గొన్నారు.