కొత్త చట్టాలను సమీక్షించాలి..

నూతన నేర చట్టాలని సమీక్షించాలి

ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయ విభాగ రాష్ట్ర ఇంచార్జ్ కర్రోల్ల రవిబాబు

సిద్దిపేట జూలై 25 ( ప్రశ్న ఆయుధం ) :

నూతన నేర చట్టాలపై ఏక సభ్య కమిషన్ నియమించి, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని తద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ గారికి విజ్ఞాపన అందించడం జరిగింది. అనంతరం ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు న్యాయ విభాగ రాష్ట్ర ఇన్చార్జ్ కర్రోల్ల రవిబాబు మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా జూలై 2024 నుండి అమలులోకి వచ్చిన నూతన నేర చట్టాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేర చట్టాల పర్యావసనం పై ప్రస్తుత శాసనసభ సమావేశాలలో చర్చించి రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయ నిపుణులతో ఏక సభ్య లేదా త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేసి నూతన నేర చట్టాలపై సమీక్షించాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విధానం ఆదర్శంగా తీసుకొని తద్వారా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని అందించాలని పార్లమెంటులో కూడా ప్రభుత్వం తరఫున ఎంపీలతో చర్చింపజేయాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా నూతన నేర చట్టాలపై సమీక్ష జరిపించిన తర్వాతనే అమలు గురించి ఆలోచించాలని మరీ ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయిన వర్గాలకు మరియు పౌరులందరికీ భారత రాజ్యాంగం కల్పించిన కనీస ప్రాథమిక హక్కులకు, పౌర హక్కులకు విరుద్ధంగా నూతన నేర చట్టాలు ఉన్నాయని ధర్మ సమాజ్ పార్టీగా భావిస్తున్నామని
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల ముందు తమ హక్కుల సాధనకై మాట్లాడుతున్న క్రమంలో రాజ్యము గాని సంబంధిత ప్రభుత్వ రాజకీయ నాయకులు గాని కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. సహజంగానే చాలా వరకు ఉన్న అపవాదు ఏంటంటే అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలకు సంబంధిత రాజకీయ పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీస్ యంత్రాంగానికి మరింతగా విచారణ అధికారాలు ఇవ్వడం న్యాయం పొందే హక్కును నిర్వీర్యం చేయడమేనని అదేవిధంగా న్యాయాధికారులు, న్యాయస్థానాల స్వతంత్రతకు మరియు న్యాయవాదుల స్థాయిని గౌరవాన్ని దిగజార్చే విధంగా ఉండటం రాజా ద్రోహం పోయి దేశద్రోహరంగా చట్టం మార్పు చేసిన అధికార పక్షాలను గాడిలో పెట్టడానికి ప్రశ్నించే హక్కును కాలరాయడం భారత రాజ్యాంగం అధికరణాలు 348, 19, 21, 254 తదితర అధికరణములకు పూర్తిగా విరుద్ధంగా నూతన నేర చట్టాలు ఉన్నాయనీ పశ్చిమ బెంగాల్, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాల అమలును వ్యతిరేకించాయని ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏకసభ్య కమిషన్ వేయడం దీనిని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొవాలని డిమాండ్ చేస్తూ పౌరులను అణచివేసే వేసే చట్టాలు అందులోని సెక్షన్లపై రాష్ట్ర పరిధిలో ఒక కమిటీని వెంటనే నియమించి వాటిపై చర్చించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ భారత రాజ్యాంగ విలువలకు లోబడి భారత ప్రజలందరికీ సమన్యాయం జరిగే విధంగా ప్రజాస్వామ్య విలువల ఆధారితంగా హేతుబద్ధంగా, ప్రజాస్వామ్యానికి, పౌరుల హక్కు లకు, స్వేచ్ఛకు భంగం కలగకుండా చట్టాల రూపకల్పన సవరణలు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జ్యోతి, జిల్లా నాయకులు డి.బి.రాజ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now