ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 25, (ప్రశ్న ఆయుధం):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాలకు రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. అక్టోబర్ 23న డ్రా ద్వారా షాపులు ఎవరు పొందుతారో ప్రకటించబడుతుంది. కొత్త షాపులు డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు నిర్వహించుకోవచ్చు.
ఈసారి ప్రతి షాపు కోసం నాన్-రీఫండబుల్ టెండర్ ఫీజు రూ. 3 లక్షలు విధించబడింది, కాగా గత సంవత్సరం రూ. 2 లక్షలు ఉండేది. షాపుల్లో గౌడ కులస్థులకు 15%, SCలకు 10%, STలకు 5% కేటాయింపు జరుగుతుంది.
ప్రభుత్వం ఈ ప్రక్రియ ద్వారా వివిధ సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, షాపుల నిర్వహణలో పారదర్శకత పెంపొందించనున్నట్లు వెల్లడించింది.