ఆర్ఎంపిల నూతన మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

అధ్యక్షుడిగా విశ్వేశ్వరరావు
శుభాకాంక్షలు తెలిపిన కమిటీ సభ్యులు,

ములకలపల్లి (ప్రశ్నఆయుధం) భద్రాద్రికొత్తగూడెం 30

ములకలపల్లి మండల ఆర్ ఎంపీల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు బండి కొమరయ్య అధ్యక్షతన నిర్వహించారు. మండల నూతన మండల అధ్యక్షుడిగా బి విశ్వాస్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ కె రఫీ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పలువురి మన్ననలు పొందారు. ఆయన సేవలను గుర్తించిన తోటి ఆర్ ఎంపిలు ఆయన్ను మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నన్ను రెండోసారి ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలకు సేవలందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపిలను ప్రభుత్వం గుర్తింపునివ్వాలన్నారు. గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయరాదని, ఏవరైనా సంఘం మాట కాదని పరిమితికి మించి వైద్యం చేస్తే యూనియన్ నుంచి తొలగిస్తామని చెప్పారు. మండల కమిటీకి సహకరించిన నా తోటి ఆర్ఎంపిలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ గ్రామీణ వైద్యులకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, సత్యనారాయణ, గంటా వెంకటేశ్వర్లు, సుభాని, రాంబాబు, రమేష్, కేశవులు, శ్రీనివాసరావు, గోపి, రాము, వేంకటేశ్వరావు తదితర గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now