నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్సీ (ప్రశ్నఆయుధం) ఆగస్టు 04
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తుందని.అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని, కేవలం కమీషన్ల కోసమే పథకాలు ప్రవేశపెట్టిందని విమర్శించారు.కాళేశ్వరంలో కమీషన్లు,దళిత బంధులో కమీషన్లు దండుకున్నారని, చివరికి గొర్రెల పంపిణీ స్కీంలో కూడా గోల్ మాల్ చేసి వెయ్యి కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు.రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారు ఇంకా ఎవరైనా ఉన్నా ధరఖాస్తులు చేసుకోవచ్చని,మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చని తెలిపారు.రేషన్ కార్డు అనేది ఒక కుటంబానికి గుర్తింపు మాత్రమే కాదని,పేదవాడి ఆత్మగౌరవ ప్రతీక, ప్రభుత్వ పథకాలకు ప్రామాణిక పత్రం అని అన్నారు.ఇంతటి ప్రాధాన్యత గల రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో ప్రజలు ఆలోచించాలని చెప్పారు.సన్నబియ్యం పంపిణీతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నదని, పేదవాడు మూడు పూటలా కడుపు నిండా అన్నం తింటున్నారని హరం వ్యకం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని,ప్రజా పాలనలో రాష్ట్రంలో సంక్షేమ కాంతులు వెల్లి విరుస్తున్నాయని చెప్పారు.జుక్కల్ నియోజకవర్గంలో ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి,ప్రజా ప్రతినిదులు,నాయకులు,లబ్ధిదారులు,ప్రజలు పాల్గొన్నారు.