డీసీసీ అభ్యర్థుల ఎంపికలో కొత్త ఒరవడి – టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం.
ప్రశ్న ఆయుధం, అక్టోబరు 14: కూకట్‌పల్లి ప్రతినిధి
” కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడినవారికే పట్టం ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకురాలు డా. అంజలి నింబాల్కర్. ”
” రాహుల్ గాంధీ ఆలోచననకనుగుణంగా తెలంగాణాలో డీసీసీ అభ్యర్థుల ఎంపికలో కొత్త ఒరవడి – టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం. ”
కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట లోని లియో బంక్యూట్స్ హాల్ లో నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడి అభ్యర్థి ఎంపిక కోసం జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సంఘటన్ సృజన్ అభియాన్ ముఖముఖి ప్రత్యేక సమావేశనికి ముఖ్య అతిధిగా హాజరైన ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకురాలు డా. అంజలి నింబాల్కర్ , డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం హాజరైనారు. ఈ సందర్బంగా ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకురాలు డా. అంజలి నింబాల్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసిన నాయకులకే పార్టీ అధిష్టానం పట్టం కడుతుందని అన్నారు. అనంతరం సత్యం శ్రీరంగం మాట్లాడుతూ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని, పార్టీ నాయకుల, కార్యకర్తల అభిష్టానానికి అనుగుణంగా డీసీసీ అధ్యక్షుల నియమాకం జరగాలని రాహుల్ గాంధీ స్పష్టం చేయడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనకనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు డీసీసీ నియామకాలు పార్టీ అధిష్టానం చేపడుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ పుష్పా రెడ్డి, టీపీసీసీ ప్రోటోకాల్ కార్యదర్శి సూరజ్ తివారి, కార్యదర్శులు దండుగుల యాదగిరి, గాలి బాలాజి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శేరి సతీష్ రెడ్డి, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు గోపిశెట్టి రాఘవేందర్, శ్రీనివాస్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, ఏ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి, బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సంధ్య, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి. సలీం, తూము వినయ్, సాధు ప్రతాప్ రెడ్డి, కర్క పెంటయ్య, గంధం యేసు రాజు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, మహిళ కాంగ్రెస్, ఆనుబంధ సంఘల ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు, మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.