*నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి
టౌన్ సిఐ వరగంటి రవి*
*జమ్మికుంట డిసెంబర్ 30 ప్రశ్న ఆయుధం*
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జమ్మికుంట టౌన్ సిఐ వరగంటి రవి అన్నారు సిఐ రవి మాట్లాడుతూ ఇతరులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించుకోవాలి కొత్త సంవత్సరానికి పురస్కరించుకొని త్రిబుల్ రైడింగ్ గాని ర్యష్ బైక్ డ్రైవింగ్ గాని వాహనదారులు చేయరాదని

ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం రాకపోకలకు అంతరాయం కలిగించడం డీజే స్పీకర్లు పెట్టి రోడ్లపై కేకులు కట్ చేయడం రోడ్లపై మద్యం సేవిస్తూ తిరగడం మొదలగునవి చేసినచో చర్యలు తప్పవు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లయితే తీవ్రమైన చర్యలు ఉంటాయని సీఐ తెలిపారు దానిలో భాగంగా సోమవారం రాత్రి వివిధ కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అనుమానంగా అనిపించిన వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ పేపర్లను డ్రైవింగ్ లైసెన్స్ లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు
Post Views: 17